డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ 2వ సెమిస్టర్ విద్యార్థులకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి
పరీక్షలు ప్రారంభం కానున్నాయని నల్గొండ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు.
విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్ సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలకు హాజరయ్యే
విద్యార్థులు ఒరిజినల్ హాల్ టికెట్, ఐడెంటిటీ కార్డుతో పాటు ఫోటో స్పష్టంగా ఉన్న ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.