నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో (అటానమస్) జువాలజి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కంటి వైద్యులు, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్, నల్గొండ ఐ.ఆర్.సి.ఎస్. వైస్ ప్రెసిడెంట్ డా. పుల్లారావు విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యన్.యస్.యస్. యూనిట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, యం. వెంకట రెడ్డి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.