మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి

4చూసినవారు
మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి
మే 1న నిర్వహించనున్న మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఛాంబర్‌లో మాట్లాడుతూ, మేడే సందర్భంగా ఉదయాత్య భవన్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ఇద్దరు మంత్రులు హాజరుకానున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్