
నేను రేపిస్టును కాదు: ట్రంప్
తాను రేపిస్టును కాదని, ఎవరినీ అత్యాచారం చేయలేదని, పెడోఫైల్ కూడా కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జర్నలిస్టు నోరా ఓడొన్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. షూటర్ మ్యానిఫెస్టోను జర్నలిస్టు చదువుతున్నప్పుడు ట్రంప్ సహనం కోల్పోయారు. డెమెక్రటిక్ నేతల విద్వేష ప్రసంగాలను కూడా ఆయన తప్పుబట్టారు, అవి దేశంలో రాజకీయ హింసకు కారణమవుతున్నాయని అన్నారు. ఇది ట్రంప్‌పై గత రెండేళ్లలో మూడోసారి జరిగిన హత్యాయత్నం.




