మంత్రి దిష్టిబొమ్మ దహనానికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు

5చూసినవారు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పి) వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు సోమవారం నల్గొండ జిల్లా కొత్త బస్టాండ్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి టీఆర్పి జిల్లా కమిటీ ప్రయత్నించింది. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహమ్మద్ తాహెర్, కార్యదర్శి సంతోషి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్