నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. మంగళవారం మర్రిగూడ హైస్కూల్‌లో విద్యార్థినులకు అక్రమ దత్తత, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు జరిగింది. అమ్మాయిలు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేసుకోవాలని, చిన్న వయసులో వివాహాలు వల్ల పుట్టే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు వస్తాయని ఆమె తెలిపారు.