వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలి

3చూసినవారు
వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలి
నల్లగొండ ఎంపీడీవో యాకూబ్ నాయక్ గురువారం మండలంలోని రాములబండలో ఉపాధి పనులు పరిశీలించి, కూలీలతో మాట్లాడారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఉపాధి హామీ కూలీలు, రైతన్నలు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని హమాలీలు, రైతులు, ఉపాధి కూలీలు, ఎండలో బయట తిరిగేవారు ఉదయం 11 గంటలలోపే పనులు ముగించుకోవాలని, ఏర్పాటు చేసిన చలివేంద్రాలను పర్యవేక్షించాలని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్