భగత్‌సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి - ఎస్‌ఎఫ్‌ఐ

2009చూసినవారు
భగత్‌సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి - ఎస్‌ఎఫ్‌ఐ
ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో షాహిద్ భగత్‌సింగ్‌ 119వ జయంతి వేడుకలను దేవరకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ భగత్‌సింగ్‌ దేశ స్వాతంత్ర కోసం చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి యువత, విద్యార్థులకు ఆదర్శమని అన్నారు. భగత్‌సింగ్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక న్యాయం, సమానత్వం, శాస్త్రీయ ఆలోచనా విధానం కోసం విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతామన్నారు.

సంబంధిత పోస్ట్