నల్గొండ: బీజేపీ పార్టీ గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమం

60చూసినవారు
నల్గొండ: బీజేపీ పార్టీ గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమం
నల్గొండ పట్టణం 41 వ వార్డు శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీలలో శనివారం జిల్లా బిజెపి నాయకుల ఆద్వర్యంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వార్డులోని భక్తాంజనేయ స్వామి దేవాలయ పరిసరాలను శుభ్రపరచి, అంగన్ వాడి కేంద్రాలను సందర్శించారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు ఇస్తున్న పౌష్టిక ఆహార వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వారికి ప్రతిరోజు ఇవ్వవలసిన వాటిని సమయానికి అందేలా చూడమని అంగన్ వాడి సిబ్బందికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్