సోమవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల నాయకుడు చిర్ర మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో, స్థానిక సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్ అధ్యక్షతన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సందీప్ కుమార్, మాజీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో
కేసీఆర్ ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించారని, కానీ రెండు సంవత్సరాల
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.