జగదీశ్వర్‌రెడ్డిపై వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఆందోళన, సీఎం దిష్టిబొమ్మ దహనం

1473చూసినవారు
జగదీశ్వర్‌రెడ్డిపై వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఆందోళన, సీఎం దిష్టిబొమ్మ దహనం
మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నల్గొండలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నల్గొండ అంజి ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల ఎదుట సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్