నల్గొండ పట్టణంలో శనివారం అర్ధరాత్రి దారుణ హత్య కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన మరియన్ ముత్తు అనే వ్యక్తి నల్గొండలోని ఒక అపార్ట్మెంట్లో మృతదేహంగా లభ్యమయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కూలీ డబ్బులు, వేతనాల విషయంలో తమిళనాడు కూలీల మధ్య జరిగిన ఘర్షణే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.