నల్గొండ పట్టణాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని, సోమవారం ముమ్మరంగా నాకాబందీ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు, 18 మంది ఎస్సైలు, 200 మంది పోలీసు సిబ్బందితో బలగాలు పాల్గొన్నాయి. పట్టణ వ్యాప్తంగా 10 చెకింగ్ బృందాలు, 8 కటాఫ్ బృందాలు, 2 డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి. లాడ్జీలు, బస్టాండ్, ప్రధాన కూడళ్లలో అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.