బాల్య వివాహాలు అరికట్టాలి

0చూసినవారు
బాల్య వివాహాలు అరికట్టాలి
బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు బాలికల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం నుండి నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నల్గొండ పట్టణంలోని రెడ్ క్రాస్ భవనంలో మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిషేధ చట్టం–2006పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై బాల్య వివాహ రహిత తెలంగాణ లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్