నల్లగొండలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్
విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. చింతల కార్తీక్ 587 మార్కులతో, దేశగాని అభయ్ స్వరూప్ 586 మార్కులతో, కొడకంచి సుధీర్ 584 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు మల్లెపాటి శ్రీధర్, శ్రీ విద్య, సుజిత, నాగేశ్వర్ రావు, ప్రిన్సిపాల్ సండ్ర నాగరాజు, మల్లేశం, రాహుల్ విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందించారు.