రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్. 1 ఫలితాలలో రాష్ట్రస్థాయి లో రెండవ ర్యాంకు సాధించిన నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన దాది వెంకటరమణను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అభినందించారు. శనివారం హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. తన తల్లిదండ్రులు రమాదేవి శ్రీనివాసరావుతో కలిసి సీఎంకు పుష్పగుచ్చం అందజేసి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు.