అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా

4చూసినవారు
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా
బక్రీద్ పండుగను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అడిషనల్ ఎస్పీ రమేశ్ తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో పోలీసు సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పండుగ వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని, ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్