వాతావరణ మార్పులు, దిగుబడి తగ్గడంతో సాగు విస్తీర్ణం క్షీణత

5చూసినవారు
వాతావరణ మార్పులు, దిగుబడి తగ్గడంతో సాగు విస్తీర్ణం క్షీణత
మారిన వాతావరణ పరిస్థితులు, సాగు ఖర్చులు పెరగడం, దిగుబడులు తగ్గడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి కారణాలతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఈ యాసంగిలో 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, అందులో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని పేర్కొంది. అయితే, సీజన్ ముగిసేనాటికి కేవలం 4.36 లక్షల ఎకరాల్లోనే వరి సాగైంది. ఇది వ్యవసాయ రంగంలో ఆందోళనకరమైన పరిణామం.

సంబంధిత పోస్ట్