దళిత బంధు లబ్ధిదారుల నిధులు వెంటనే విడుదల చేయాలి

0చూసినవారు
దళిత బంధు లబ్ధిదారుల నిధులు వెంటనే విడుదల చేయాలి
నల్లగొండ నియోజకవర్గంలోని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ఇప్పటికే మంజూరైన దళిత బంధు నిధులను విడుదల చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో జరిగిన దళిత బంధు లబ్ధిదారుల సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గంలో 1243 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చి, వారి పేర్లకు మూడు లక్షల రూపాయల చొప్పున మొత్తం 33 కోట్ల రూపాయలు అకౌంట్లలో జమ చేశారని, కానీ ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్