నల్లగొండ జిల్లా కేంద్రంలో జింకల కలకలం చెలరేగింది. స్థానిక ఐటీ టవర్ ఎదురుగా ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయం వద్ద రెండు జింకలు కనిపించాయి. మునుగోడు అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. భయంతో పరుగులు తీసిన జింకలలో ఒకటి తీవ్ర గాయాలతో కుప్పకూలింది. గాయపడిన జింకకు చికిత్స అందించినా ఫలితం లేక మృతి చెందింది. అటవీశాఖ అధికారులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పంపిణీ చేశారు. ఈ సంఘటన స్థలంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రవీందర్ గౌడ్, రేంజ్ అధికారి వీరేంద్ర బాబు, వన్యప్రాణుల సంరక్షణ సిబ్బంది ఉన్నారు.