బుద్ధవనంలో రూ.25కోట్లతో డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నిర్మాణం

2చూసినవారు
బుద్ధవనంలో రూ.25కోట్లతో డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నిర్మాణం
ప్రపంచ బౌద్ధ పర్యాటక కేంద్రమైన బుద్ధవనంలో రూ.25 కోట్లతో అత్యాధునిక డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. బుద్ధవనం 2.0 ప్రాజెక్టులో భాగంగా 8 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వీఆర్, ఏఆర్, 3డీ, లేజర్ సాంకేతికతలతో గౌతమ బుద్ధుడి జీవితచరిత్ర, జాతక కథలను సజీవంగా ప్రదర్శించనున్నారు. ఇందుకోసం నిర్మించే 150 అడుగుల భారీ డోమ్ థియేటర్‌లో ఒకేసారి 500 మంది వీక్షించే అవకాశం లభించనుంది.

సంబంధిత పోస్ట్