కార్పొరేషన్ సాధారణ సమావేశంలో సమస్యలపై చర్చలు

0చూసినవారు
కార్పొరేషన్ సాధారణ సమావేశంలో సమస్యలపై చర్చలు
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశంలో కార్పొరేటర్లు తమ డివిజన్లలో నెలకొన్న విద్యుత్, మంచినీటి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేసవిలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు మంచినీటి సమస్య లేకుండా చూస్తామని మేయర్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్