నల్గొండ జిల్లాలో రేపటి నుంచి లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభ్యుడికి ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని ఇవ్వనున్నారు. జిల్లాలో 5.27 లక్షల కార్డులకు గాను 22,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. మొత్తం 1,051 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ కోసం బియ్యం స్టాక్ ఇప్పటికే షాపులకు చేరుకుంటోంది.