రైతులు వ్యవసాయం ద్వారా మంచి లాభాలు సంపాదించేందుకు ఎప్పుడూ పండించే సాధారణ పంటలు కాకుండా, ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. నల్గొండ జిల్లాలో విభిన్న పంటలను పండించి అధిక ఆదాయం ఆర్జిస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తిప్పర్తి మండలం అంతాయగూడెంలో రైతు కమలాకర్ రెడ్డి సాగు చేస్తున్న "అంజీర" తోటను పరిశీలించారు.