నల్లగొండ జిల్లాలో 2026 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, బుధవారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఏర్పాట్లు, నామినేషన్ దాఖలు విధానం, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, క్యూలైన్లు, పోలీస్ బందోబస్త్, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలను ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు.