సీఎం పర్యటన వేళ డీవైఎఫ్ఐ నేతల అరెస్ట్..

0చూసినవారు
సీఎం పర్యటన వేళ డీవైఎఫ్ఐ నేతల అరెస్ట్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో డీవైఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల సమస్యలపై, ఉద్యోగాల భర్తీపై డిమాండ్ చేసినందుకు అర్ధరాత్రి వేళ ఇళ్లకు వచ్చి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ కొలువులను కూడా వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్