వేసవి తాపం, వ్యవసాయ, గృహ, వాణిజ్య రంగాల్లో వినియోగం పెరగడంతో నల్లగొండ జిల్లాలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) గణాంకాల ప్రకారం, బుధవారం జిల్లాలో విద్యుత్ డిమాండ్ 772 మెగావాట్లకు చేరుకుంది. మంగళవారం 709 మెగావాట్లుగా ఉన్న డిమాండ్, బుధవారం 63 మెగావాట్లు అధికమైంది. గత ఏడాది ఇదే రోజున 608 మెగావాట్లతో పోలిస్తే ఈ ఏడాది 164 మెగావాట్లు ఎక్కువగా నమోదైంది. దీంతో జిల్లాలో విద్యుత్ అవసరాలు ఏటేటా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది.