మూగజీవాల దాహార్తి తీర్చే తొట్టి నిరుపయోగం, రైతుల ఆవేదన

0చూసినవారు
నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని పంచాయితీ కార్యాలయం ఎదుట గత ప్రభుత్వం హయాంలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టి, నిర్వహణ లోపంతో గత ఎనిమిది నెలలుగా నిరుపయోగంగా మారింది. దీనితో మూగజీవాలు నీటి కోసం చెరువులు, కాలువల వద్దకు వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ తొట్టిని వినియోగంలోకి తీసుకురావాలని పశుపోషకులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్