మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు సోమవారం నుండి నిరవధిక బంద్ చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. కళాశాలల ఎదుట బంద్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.