
పెద్ది సినిమా.. థియేటర్లో మెగా హీరో రచ్చ (వీడియో)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా ప్రీమియర్లు నిన్న ప్రదర్శితమయ్యాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో క్రీడల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ప్రీమియర్లు చూసిన మెగా హీరో వరుణ్ తేజ్, హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో రామ్ చరణ్ సీన్స్‌కు అభిమానిలా విజిల్స్ వేస్తూ, కేకలు వేస్తూ సినిమాను ఎంజాయ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.




