నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో ఎం. వి. ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఎన్నారై మునుకుంట్ల తిరుమల్ రెడ్డి, మాజీ సర్పంచ్ విద్యావతి వెంకటరెడ్డిల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరం సరస్వతమ్మ ఫంక్షన్ హాల్ లో పది రోజుల పాటు నిర్వహించబడుతుంది. శంకర నేత్రాలయ సహకారంతో జరిగే ఈ శిబిరంలో మొబైల్ సర్జికల్ వైద్య పరీక్షలతో పాటు ఉచిత కంటి అద్దాలు అందజేయబడతాయి.