స్నేహితుడిని హత్య చేసిన స్నేహితులు: అప్పు ఇవ్వలేదనే కక్షతో దారుణం

0చూసినవారు
స్నేహితుడిని హత్య చేసిన స్నేహితులు: అప్పు ఇవ్వలేదనే కక్షతో దారుణం
నల్లగొండ జిల్లాలో స్నేహితుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన పూర్ణాన్, ఆరీఫ్ లు నల్లగొండలో చీరల వ్యాపారం చేసుకుంటూ, స్థానికుడైన బోధ్ సాయికుమార్ తో స్నేహం పెంచుకున్నారు. తరచూ కలిసి మద్యం సేవించేవారు. ఈ క్రమంలో పూర్ణాన్, సాయికుమార్ ను రూ.30వేలు అప్పు అడిగాడు. సాయికుమార్ నిరాకరించడంతో పూర్ణాన్ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 8న, ఆరీఫ్ తో కలిసి సాయికుమార్ ను కేశరాజుపల్లిలోని వెంచర్ కు మద్యం తాగడానికి పిలిచి, డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో బండరాయితో కొట్టి హత్య చేశారు.

సంబంధిత పోస్ట్