ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాల సందర్భంగా గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాదు నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో 99 రోజుల కార్యాచరణ, పర్యావరణ వారోత్సవాలు, గ్రామసభల నిర్వహణపై చర్చించారు.