నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాల జారీ కోసం 'సదరం' శిబిరాల తేదీలను అధికారులు ప్రకటించారు. శారీరక వైకల్యానికి 7, 16, 21, 23 తేదీల్లో, మానసిక స్థితికి 8, 22 తేదీల్లో, దృష్టి లోపానికి 9, 28 తేదీల్లో, శ్రవణ లోపానికి 6, 13, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హులు మీ-సేవ లేదా UDID పోర్టల్‌లో ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.