మంగళవారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నల్గొండ, యాదాద్రి జిల్లాల అధికారులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏసంగి పంట ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, శాశ్వత పరిష్కారాల మార్గాలపై సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం నల్గొండ జిల్లా పరిధిలోని మునుగోడు, చండూరు, ఘట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ మండలాలలో 2,85,560 క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరగగా, ఈ సంవత్సరం 4,20,430 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.