నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఉపాధి హామీ పనులు జరిగే చోట కూలీలకు నీడ, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. వన మహోత్సవం సందర్భంగా వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు గ్రామాల్లో స్థలాలను గుర్తించాలని, నర్సరీలలోని మొక్కల వివరాలను గ్రామసభల్లో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. బుధవారం ఆయన శాలిగౌరారం మండలం, వల్లాల, అడ్లూరు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ సంస్థలు, పనులను తనిఖీ చేశారు.