భూభారతి కేసుల పరిష్కారంలో భాగంగా, గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మిర్యాలగూడ మండలం, కొత్తగూడెం శివారులోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. మండలంలో ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములపై తాసిల్దార్ తో విచారించి, భూభారతి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.