కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ. వి. ఎల్. నరసింహ రావు కన్నారావు బుధవారం నల్లగొండలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దివంగత నేత చకిలం శ్రీనివాసరావు అనుచరుడిగా కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన, గత ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ లో చేరారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బండ నరేందర్ రెడ్డి కన్నారావుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.