నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన ఏరుకొండ లింగయ్య బుధవారం చింతపల్లి మండలం మాల్ సాగర్ ప్రధాన రహదారిపై ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. మరణానంతరం, కుటుంబ సభ్యులు లింగయ్య అవయవాలను దానం చేశారు. తాను మరణించినా నలుగురికి ప్రాణం ఇచ్చిన లింగయ్య కుటుంబ సభ్యులను గ్రామస్థులు అభినందించారు.