సకాలంలో లారీలు పంపాలి

7చూసినవారు
సకాలంలో లారీలు పంపాలి
గురువారం నల్లగొండ పట్టణంలోని గంధంవారిగూడెం హక వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ట్రాన్స్పోర్ట్ లారీలు సకాలంలో వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు ఇష్టానుసారం సీరియల్ పాటించకుండా కాంటాలు వేసి పంపిస్తున్నారని ఆరోపించారు. సెంటర్ ప్రారంభించి 40 రోజులు అవుతున్నా 50 శాతం ధాన్యం కూడా ఎగుమతి కాలేదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్