మాడుగులపల్లి మండల పరిధిలోని తోపుచర్ల గ్రామంలో భీమ్ సోల్జర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రణవ్ టీంకు అదే గ్రామానికి చెందిన డాక్టర్ ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి సోమవారం పదివేల రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ బీమ్ సోల్జర్స్ ఫౌండేషన్ మున్ముందు మరిన్ని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని భీమ్ సోల్జర్స్ ఫౌండేషన్ ను కొరారు. ఆయన వెంట టీచర్ వల్లపు దాస్ సతీష్, రాచూరి వెంకన్న, వల్లపుదాస్ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.