ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

4చూసినవారు
ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంజియూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ మహత్తర జీవితం మరియు ఆదర్శాలను స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. సత్యం, అహింస, నైతిక విలువలు అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీయుడు గాంధీజీ అని, ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, ఒక జీవన విధానమని, స్వీయ క్రమశిక్షణ, సేవాభావం కలిగిన గొప్ప వ్యక్తి అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్