గొల్లపల్లి గ్రామానికి చెందిన అనంతుల రాములు శుక్రవారం పెట్రోల్ బంకుకు వెళ్లి తిరిగి వస్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాములు మొదట మల్కాజిగిరిలోని ఆసుపత్రిలో, ఆపై మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉప్పల్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.