నల్గొండ జిల్లాలో రహదారులు, వంతెనల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయం 'ఇందిరాభవన్'లో ఆర్&బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుద్ధారం, అప్పాజిపేట, బ్రాహ్మణవెల్లంల రహదారి పనులను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని, సోమనవాగుపై పగిడిమర్రి వంతెన పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రి నిర్దేశించారు.