ఉప ముఖ్యమంత్రి సీపీఆర్ఓ, సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ అకాల మరణం పట్ల రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం నల్గ
ొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్‌లో గల మధుసూద
న్ నివాసానికి చేరుకున్న మంత్రి, ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి, వారిని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని తక్షణ సాయంగా కుటుంబానికి అందజేశారు. ప్రభుత్వం పరంగా మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.