నల్గొండలో జరిగిన 'స్టేట్ సిట్రస్ సెమినార్-2026' కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో బత్తాయి సాగు ప్రధాన పంటగా మారిందని, వేలాది మంది రైతుల జీవనాధారం ఈ తోటలేనని ఆయన పేర్కొన్నారు. అయితే, మార్కెట్ ధరల అస్థిరత, ఎరువులు, పురుగుమందుల ధరల పెరుగుదల, దిగుబడి నాణ్యత వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.