
UNSCలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత సూత్రాలను పాకిస్థాన్ ఉల్లంఘిస్తోందని భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పర్వతనేని ఆరోపించారు. తమపై జరిగే ఉగ్రదాడుల నుంచి తమను తాము రక్షించుకునే హక్కు తమకు ఉందని, పాకిస్థాన్ చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు.




