5,40,227 ఖాతాల్లోకి డబ్బులు

1822చూసినవారు
5,40,227 ఖాతాల్లోకి డబ్బులు
నల్గొండ: వానాకాలం సాగు పనులు ఊపందుకున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ‘రైతు భరోసా’ నిధులను మంగళవారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయగా, తొలి విడతలో రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. జిల్లాలో మొత్తం 5,83,441 మంది పట్టాదారు పాస్‌పుస్తకాలు కలిగిన రైతులు ఉండగా, వారిలో 5,40,227 మంది రైతు భరోసాకు అర్హులుగా గుర్తించినట్లు DAO వినోద్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్