నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సయ్యద్ ముసాబ్ అహ్మద్‌కు గ్రేడ్-1 కమిషనర్‌గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా మంగళవారం మున్సిపల్ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పారిశుధ్య నిర్వహణలో ఆయన చూపిన ప్రత్యేక శ్రద్ధతో నల్లగొండ మున్సిపాలిటీకి దేశస్థాయిలో అవార్డు లభించిందని సిబ్బంది కొనియాడారు.