విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అన్ని మరమ్మతు పనులను జూన్ 10లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మండల విద్యాశాఖ అధికారులు, ఆర్‌సీఓలు, సంక్షేమ శాఖ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బడిబాట కార్యక్రమం ఏర్పాట్లు, ఎనర్జీఎస్ నిధుల వినియోగం, పాఠశాల భవనాల మరమ్మతులు, పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, అంగన్‌వాడీ కేంద్రాల సౌకర్యాలు, విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.